News February 11, 2026
పట్టిసీమ: వీరభద్రేశ్వరుడుని దర్శించుకున్న ప్రముఖ సినీ రచయిత

ప్రసిద్ధ శైవక్షేత్రమైన పట్టిసీమ శ్రీ వీరభద్రేశ్వర స్వామిని రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త వీరభద్రరావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజానగరం ఇన్‌ఛార్జి వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 20, 2026
తూ.గో: ‘క్వింటా శనగలు రూ.5,875కే కొనుగోలు’

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా తూ.గో జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర క్వింటా రూ.5,875 చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ దేవరపు ప్రతాప్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా RBK వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు RBK కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.
News February 20, 2026
జిల్లా రిజిస్ట్రార్‌గా జగన్మోహనరావు బాధ్యతల స్వీకారం

తూ.గో. జిల్లా నూతన రిజిస్ట్రార్‌గా కె.జగన్మోహనరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, సీనియర్ అసిస్టెంట్‌గా, గ్రేడ్-2, గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా సేవలందిస్తూ పదోన్నతిపై ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News February 19, 2026
గొల్లగూడెం: ట్రాక్టరుపై నుంచి పడి బాలిక స్పాట్ డెడ్

దేవరపల్లి మండలంలోని గొల్లగూడెం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిడదవోలు మండలం సమీశ్రగూడెంకు చెందిన ఓ కుటుంబం పొగాకు పనుల నిమిత్తం దుమంతులగూడెం వలస వచ్చింది. పనికి వెళ్తుండగా ట్రాక్టరుపై నుంచి బాలిక ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దేవరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


