News January 24, 2026
పట్టు వస్త్రాలు సమర్పించిన బండారు శ్రావణి

బుక్కరాయసముద్రం శ్రీ కొండమీద వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఆమె కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Similar News
News February 11, 2026
వైసీపీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది: పవన్

AP: వైసీపీ కుట్రలపై మూడు పార్టీలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభాపక్షం భేటీ అయింది. వైసీపీ విధ్వంస కుట్రలపై సభలో చర్చించాలని పవన్ పేర్కొన్నారు. ఆ పార్టీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
News February 11, 2026
భక్తులతో మర్యాదగా మెలగండి: ఎస్పీ

శ్రీశైల బ్రహ్మోత్సవాల విధుల్లో ఉన్న సాయుధ బలగాల సిబ్బందికి జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ దిశానిర్దేశం చేశారు. భక్తులతో గౌరవంగా వ్యవహరిస్తూ వారికి మార్గదర్శనం చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఒత్తిడిలోనూ సహనం కోల్పోరాదని సూచించారు. శివభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News February 11, 2026
ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలి: కలెక్టర్ ప్రావీణ్య

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలోని 31వ వార్డు విద్యానగర్ సెయింట్ ఆంథోనీ స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పి. ప్రావీణ్య బుధవారం సందర్శించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆమె.. ఓటర్ జాబితా, బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓటింగ్ కంపార్ట్‌మెంట్లను తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు పటిష్ఠంగా ఉండాలని ఆదేశించారు. ఓటర్లు అందరూ స్వచ్చందగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.


