News January 24, 2026
పట్టు వస్త్రాలు సమర్పించిన బండారు శ్రావణి

బుక్కరాయసముద్రం శ్రీ కొండమీద వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఆమె కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Similar News
News February 17, 2026
ఏలూరు: శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం

జంగారెడ్డిగూడెం మండలం వెంకట రామానుజపురంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. మేనమామ ఇంటి శుభకార్యానికి వచ్చిన నూనె సుశాంత్ (11) ఆడుకుంటూ గ్రైండర్ విద్యుత్ వైర్ మీద కాలు వేయడంతో షాక్‌కు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.
News February 17, 2026
కాకినాడ నుంచి ఆకాశంలోకి రాకెట్లు..!

కాకినాడ తీరంలోని హోప్ ఐలాండ్‌ను రాకెట్ ప్రయోగ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి ఇస్రో (NRSC) శాస్త్రవేత్తల బృందం ఫిబ్రవరి 18 నుంచి 3 రోజుల పాటు కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పర్యటించనుంది. వరద మ్యాపింగ్, హెచ్చరిక వ్యవస్థలపై అధ్యయనంతో పాటు హోప్ ఐలాండ్ అనుకూలతను ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.
News February 17, 2026
650 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

RBIలో 650 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. మార్చి 8 వరకు <


