News October 8, 2025

పడిపోయిన అరటి ధరలు.. నష్టాల్లో రైతులు

image

అరటి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో SRపురం, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో రైతులు విరివిగా అరటి పంటను సాగు చేశారు. ధరలు లేకపోవడంతో పలువురు రైతులు పంటను తోటలోని వదిలేస్తున్నారు. రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.

Similar News

News October 8, 2025

చిత్తూరు: రైతులకు విరివిగా రుణాలు

image

ప్రభుత్వ ఆదేశాలతో రబీ సీజన్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని లీడ్ బ్యాంకు మేనేజర్ హరీష్ వివిధ బ్యాంకులను ఆదేశించారు. రబీ సీజన్‌లో 3,479 కోట్ల వరకు రైతులకు రుణాలు ఇస్తామన్నారు. జిల్లాలో 3.20 లక్షలు మంది రైతులు రుణాలు పొందవచ్చని సూచించారు. అనుబంధ రంగాలకు అదనంగా మరో రూ.16.3 కోట్లు రుణాలు మంజూరు చేస్తామన్నారు.

News October 8, 2025

చిత్తూరు: పోలీస్ కస్టడీకి పూర్వ ఆర్డీవో

image

మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో మరో కదలిక వచ్చింది. పూర్వ ఆర్డీవో మురళిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మురళికి ఇచ్చిన మద్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయనను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును ఆశ్రయించింది.

News October 8, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని సామగుట్టు పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో కుప్పం మండలం నూలుకుంట కు చెందిన వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.