News January 14, 2026

పతంగ్: Made In Dhoolpet

image

పతంగ్.. పండుగ 3 రోజులే కానీ, 365 రోజులు ధూల్‌పేటలో గాలిపటాల తయారీ ఉంటుందని మీకు తెలుసా?. అవును.. స్టేట్‌ వైడ్‌ వ్యాపారులు, నగరవాసులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. దీంతో లక్షల్లో పతంగులు సిద్ధం చేయాలి. హ్యాండ్‌మేడ్ కదా.. 5 రోజులకు ఒక్కరు 100 పేపర్ పతంగుల వరకు తయారీ చేయగలరు. అందుకే ఏడాది మొత్తం శ్రమించి 500 రకాల విభిన్న రూపాల్లో లక్షల్లో పతంగులు రెడీ చేస్తారు. పైఫొటోలో ఉన్న పతంగ్ Made In Dhoolpet.

Similar News

News March 6, 2026

HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

image

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్‌ఫాం వేదమందిర్‌కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <>ఇక్కడ క్లిక్ <<>>చేసి మీ వివరాలు నమోదు చేయండి. మా ప్రతినిధులే మిమ్మల్ని సంప్రదిస్తారు.

News March 6, 2026

HYD: నీరు వృథా.. ఖజానా ఖాళీ!

image

జలమండలిని ఇప్పుడు ‘నాన్-రెవెన్యూ వాటర్’ (NRW) భూతం వేధిస్తోంది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో దాదాపు 40% లీకేజీలు, అక్రమ కనెక్షన్ల ద్వారా వృథా అవుతుండటంతో బోర్డు దివాలా తీసే స్థితికి చేరింది. అటు సుంకేసుల ఇన్-టేక్ వెల్ వద్ద సాంకేతిక సమస్యల భయం వెంటాడుతుంటే ఇటు కొండాపూర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో తాగునీటిలో మురుగు కలుస్తోందన్న ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి.

News March 5, 2026

HYDలో ఇక ‘RED’ నోటీసులు

image

ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఇప్పుడు ట్యాక్స్ బాకీదార్లపై కన్నెర్ర చేస్తోంది. ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో ‘రెడ్ నోటీసుల’ పర్వం మొదలైంది. గడువు దాటితే సెక్షన్ 269 ప్రయోగించి ఆస్తుల జప్తుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే వెయ్యి కోట్ల బకాయి ఉండటం. ఈ నిధులు రాకపోతే వరద నివారణ, రోడ్ల మరమ్మతు పనులు గంగలో కలవడం ఖాయమనే విమర్శలొస్తున్నాయి.