News December 19, 2025
పతాక నిధి సేకరణలో గుంటూరుకు ప్రథమ స్థానం

సాయుధ దళాల పతాక నిధి సేకరణలో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి రూ. 17,67,363 నిధులు సేకరించినందుకు గానూ కలెక్టర్ తమీమ్ అన్సారియాకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రశంసా పత్రం అందజేశారు. లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ జాబితాలో బాపట్ల ద్వితీయ, తూర్పు గోదావరి జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచాయి.
Similar News
News December 29, 2025
గుంటూరు జిల్లాలో 2025లో టాప్ కేసు ఇదే!

మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రూ.5 కోట్ల బంగారు దోపిడీ కేసు గుంటూరు జిల్లాలో 2025 సంవత్సరానికి టాప్–1 కేసుగా నిలిచింది. ఫిబ్రవరి 15న ఆత్మకూరు జంక్షన్ వద్ద జువెలరీ సిబ్బందిపై దాడి చేసి 4.9 కిలోల బంగారం అపహరించారు. సాంకేతిక ఆధారాలతో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి, 4,814.42 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛార్జ్‌షీట్ దాఖలుతో గుంటూరు జిల్లా పోలీసుల గుర్తింపు పొందారు.
News December 29, 2025
నేడు ప్రజా అర్జీలు స్వీకరించనున్న గుంటూరు కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. https://Meekosam.ap.gov.in లేదా తమకు నేరుగా అర్జీలు అందించవచ్చని చెప్పారు. డయల్ 1100 కి ఫోన్ చేసి సమర్పించిన అర్జీల స్థితిగతులను తెలుసుకోవచ్చని సూచించారు. ప్రతి వారం అర్జీలు అధికంగా వస్తున్న నేపథ్యంలో శాఖల వారీగా ప్రత్యేక నమోదు విభాగాలు అందుబాటులో ఉంటాయన్నారు.