News May 20, 2024

పత్తికొండ: ‘రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి’

image

పత్తికొండలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రాయితీపై వేరుశెనగ విత్తనాలు కావాల్సిన రైతులు ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని పత్తికొండ మండల వ్యవసాయ అధికారి వెంకటరాముడు అన్నారు. మే 20 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. నమోదు ప్రక్రియ అనంతరం రైతులకు విత్తనాలు అందజేస్తామని అన్నారు.

Similar News

News February 25, 2026

ఇంటర్ పరీక్షలకు 852 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 852 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 27,571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 26,718 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

News February 25, 2026

ఉపాధి పనులు శనివారంలోపు ప్రారంభించాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ, ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర అంశాలపై కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం కింద మంజూరైన పనులన్నీ శనివారం నాటికి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్రకు నమోదు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

News February 24, 2026

కర్నూలు: ఇంటర్‌ పరీక్షలకు 297 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 297 మంది విద్యార్థులు హాజరు కాలేదని రీజనల్ ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్ లాలప్ప తెలిపారు. మొత్తం 21,147 మంది విద్యార్థులకు గానూ 21,174 మంది పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన స్పష్టం చేశారు.