News March 26, 2025
పత్తికొండ వాసి రామ్మోహన్‌కు సేవా పురస్కారం

పత్తికొండకు చెందిన కేపీఆర్ మైత్రి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్మోహన్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. తన సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పాండిచ్చేరిలో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ అచీవర్స్ అవార్డు-2025 ప్రధానోత్సవంలో డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అవార్డును అందుకున్నారు.
Similar News
News March 26, 2025
‘గిరిజన నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’

కర్నూలు జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌ను కలిసి వినతపత్రం అందచేశారు. టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతోమంది గిరిజన నిరుద్యోగ యువత ఉపాధి లేక జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక శిక్షణను సెట్కూరు ద్వారా అందించాలని కోరారు.
News March 26, 2025
ఆదోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్

ఆదోని అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎలక్షన్‌కు రంగం సిద్ధం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్స్‌గా విజయ భాస్కర్ రెడ్డి, సోమశేఖర్, హనుమేశ్‌ను ఎన్నుకున్నారు. న్యాయవాదుల మధ్య రెండు ప్యానల్స్ నుంచి నామినేషన్ వేశారని, ప్రెసిడెంట్‌గా శ్రీరాములు, మధుసూదన్ రెడ్డి మధ్య.. వైస్ ప్రెసిడెంట్‌గా జే.వెంకటేశ్వర్లు, లోకేశ్ కుమార్ మధ్య పోటీ ఉండగా.. మరి కొంతమంది నామినేషన్ దాఖలు చేశారని ఎలక్షన్ ఆఫీసర్లు తెలిపారు.
News March 26, 2025
అడుగుకు ‘రూపాయి పావలా’ కమీషన్ వసూలు: YCP

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ మరోసారి సంచలన ఆరోపణ చేసింది. ‘నిన్న మొన్నటివరకు చికెన్ షాప్‌ల మీద పడి దండుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు పొగాకు గోదాములను కూడా వదలడం లేదు. అడుగుకు ‘రూపాయి పావలా’ చొప్పున తనకు రౌడీ మాములు ఇస్తే తప్ప అక్కడ పొగాకు నిల్వ చేయనివ్వమని హెచ్చరించారు. ఎమ్మెల్యే దిగజారుడుతనం చూసి వ్యాపారులు భీతిల్లుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.