News February 6, 2026
పత్తి అమ్మకాలకు “కపాస్ కిసాన్” యాప్‌లో నమోదు ఎలా?

“కపాస్ కిసాన్” యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్‌లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.
Similar News
News February 21, 2026
మనిషికి ‘బర్డ్‌ఫ్లూ’ సోకిందన్న ప్రచారం అవాస్తవం: వైద్యారోగ్య శాఖ

AP: చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి బర్డ్‌ఫ్లూ సోకిందన్న ప్రచారాన్ని వైద్యారోగ్య శాఖ ఖండించింది. రాష్ట్రంలో ఎక్కడా మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకలేదని స్పష్టం చేసింది. అనుమానిత లక్షణాలున్న 54 మందికి టెస్టులు చేయగా నెగటివ్ వచ్చిందని పేర్కొంది. ఇటీవల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News February 21, 2026
కందులను నిల్వ చేసేటప్పుడు జాగ్రత్తలు

కంది గింజలను గోనె సంచులలో లేదా ట్రిపుల్ లేయర్ బ్యాగులలో గాని నిల్వ చేయాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన, నేలపై లీటరు నీటికి మలాథియాన్ 50% ఇ.సి 20ML కలిపి పిచికారీ చేయాలి. కంది గింజలు నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. గృహ అవసరాల కోసం నిల్వ చేస్తే బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంటనూనె 50mlను కిలో గింజలకు పట్టించి నిల్వచేసి పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు.
News February 21, 2026
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌లో ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(<


