News January 10, 2026
పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ ఎలా?

పత్తి ఏరిన తర్వాత కట్టెలను ట్రాక్టర్‌తో నడిచే ష్రెడ్డర్ యంత్రంతో ముక్కలుగా చేయవచ్చు. తర్వాత రెక్క నాగలితో లోతు దుక్కి చేయాలి. ఈ వ్యర్థాలను తొందరగా కుళ్లించే సూక్ష్మజీవుల కల్చర్‌ను, ట్రైకోడెర్మ జీవ శిలీంధ్రనాశినిని పశువుల ఎరువుతో కలిపి నేలపై చల్లి రోటవేటర్‌తో దున్ని చదును చేయాలి. పత్తి కట్టె వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ లేదా వర్మికంపోస్టు విధానంలో సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చు.
Similar News
News February 15, 2026
‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్లే..

దళపతి విజయ్ ఆఖరి సినిమా ‘జన నాయగన్’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు మరో షాకింగ్ న్యూస్. సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్న ఈ మూవీ ఇప్పుడు ఏప్రిల్ వరకు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. కెనడా డిస్ట్రిబ్యూటర్ ‘యార్క్ సినిమాస్’ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2026 ఏప్రిల్ 30కి ముందు ఈ చిత్రం రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తేల్చి చెప్పింది.
News February 15, 2026
ఇవాళ ఓడితే నేపాల్, నమీబియా ఇంటికే?

ఇవాళ WCలో భారత్ vs పాక్‌తో పాటు మరో 2 మ్యాచులు జరగనున్నాయి. ఉ.11 గంటలకు వెస్టిండీస్, నేపాల్ తలపడనున్నాయి. ఇప్పటివరకు నేపాల్ 2 మ్యాచులు ఆడగా రెండింట్లోనూ ఓడింది. ఇవాళా ఓడిపోతే ఆ జట్టు దాదాపుగా ఎలిమినేట్ అయినట్లే. ఇక మ.3 గం.కు నమీబియా, USA మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు USA 3 మ్యాచుల్లో ఒకటి గెలిచింది. అటు నమీబియా రెండింట్లోనూ ఓటమిపాలైంది. ఇవాళ కూడా నమీబియా ఓడితే దాదాపుగా ఇంటిదారి పట్టినట్లే.
News February 15, 2026
ESIC వారణాసిలో 51 పోస్టులకు నోటిఫికేషన్

ESIC వారణాసి 51పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,23,100, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.78,800,అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. సైట్: esic.gov.in


