News October 23, 2025

పత్తి కొనుగోలుపై అదనపు కలెక్టర్ సమీక్ష

image

మహబూబాబాద్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పత్తి కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్‌ను అధికారులకు వివరించారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 84,728 ఎకరాల్లో పత్తి పంట సాగు జరిగిందని 6,14,000 క్వింటాల పత్తి దిగుబడి వస్తుందన్నారు. జిల్లాలో పత్తి పంట కొనుగోలు చేసేందుకు ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News October 24, 2025

పారాది వద్ద రాకపోకలకు అంతరాయం

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురవడంతో వేగవతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద పెరగడంతో బొబ్బిలి మండలం పారాది కాజ్వే పైనుంచి వరదనీరు పారుతోంది. దీంతో వాహనాలు రాకపోకలను నిలిపి వేశారు. వాహనాలు రాకపోకలు ఆగిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బస్సులు, మినీ వాహనాలకు పాత వంతెన పైనుంచి రాకపోకలకు అనుమతి ఇచ్చారు.

News October 24, 2025

పసుపును అంతర పంటగా ప్రోత్సహించాలి: తుమ్మల

image

పామాయిల్ సహా ఇతర పంటల్లో పసుపును అంతర పంటగా సాగుకు చర్యలు తీసుకోవాలని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అధిక నాణ్యత గల పసుపు రకాలను రైతులకు అందించి వాటి సాగును ప్రోత్సహించాలన్నారు. మంత్రి తుమ్మలను కలిసిన జాతీయ పసుపుబోర్డు కార్యదర్శి భవానిశ్రీ గత ఆరు నెలల్లో బోర్డు పనితీరును వివరించారు. పసుపు ఉడకబెట్టే యంత్రాలు, గ్రైండర్లను రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

News October 24, 2025

ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం హెచ్చరికలు

image

కర్నూలు(AP) <<18087387>>బస్సు ప్రమాద<<>> ఘటనపై విచారణకు ఆదేశించామని TG మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సుల ఫిట్‌నెస్, ఇతర అంశాల్లో రూల్స్ పాటించకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని ప్రైవేట్ ట్రావెల్స్‌ను హెచ్చరించారు. ‘తనిఖీలు చేస్తే వేధింపులని అంటున్నారు. ఇవి వేధింపులు కాదు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే యాక్షన్’ అని చెప్పారు. ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తామని అన్నారు.