News September 23, 2025
పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

పత్తి కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News September 23, 2025
GDK: మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాజయ్య

జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోదావరిఖనికి చెందిన ఎజ్జ రాజయ్యను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. సలహాదారులుగా రాజేశం, నూనేటి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రాజయ్య, సాంబశివరావు, కృష్ణ తదితరులున్నారు.
News September 23, 2025
MBNR: పీయూలో రేపు NSS-2025 దినోత్సవ వేడుకలు

పాలమూరు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో రేపు NSS-2025(జాతీయ సేవా పథకం) దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి (VC) ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. NSS ఛైర్మన్ డాక్టర్ సిహెచ్ రవికాంత్ హాజరుకానున్నారు.
News September 23, 2025
జగిత్యాల: ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలిపారు. ముస్లిం, సిఖ్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీలు వంటి మైనారిటీ కమ్యూనిటీల మహిళలు అర్హులన్నారు. ఆసక్తిగల వారు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో OCT 6 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సంక్షేమ అధికారి తెలిపారు.