News October 22, 2025

పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్ధం.. రైతుల్లో నూతన ఆశలు.!

image

పల్నాడు జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ నెలాఖరులో 7 జిన్నింగ్ కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుంది. క్వింటాకు రూ. 8,110 మద్దతు ధర ప్రకటించింది. 12% కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత మార్కెట్ ధరలు రూ. 6,500- 7,000 మధ్య ఉండటంతో రైతులు సీసీఐపై ఆశలు పెట్టుకున్నారు. దళారుల బారిన పడకుండా ఇక్కడే అమ్ముకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News October 22, 2025

గద్వాల్: రోడ్డు కనెక్టివిటీకి అడుగులు..!

image

గద్వాల జిల్లా పరిధిలోని పలు రహదారుల పునరుద్ధరణకు రూ.316.45 కోట్ల నిధులు మంజూరైనట్లు MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ➤ ఎరిగెర- అయిజ- అలంపూర్ రోడ్ రూ.9.61 కోట్లు ➤ గద్వాల-జమ్మిచేడు, పూడూరు x రోడ్, పుటాన్‌పల్లి, ఎర్రవల్లి) రూ.39.84 కోట్లు ➤ గద్వాల రాయచూర్ రూ.74.29 కోట్లు ➤ గద్వాల-అయిజ‌ రూ.24.32కోట్లు ➤ బల్గెర మాచర్ల రోడ్డు రూ.1.5కోట్లు ➤ గట్టు మాచర్ల రోడ్డు రూ.12.80 కోట్లు మంజూరయ్యాయి.

News October 22, 2025

తుని ఘటనపై మంత్రి నారా లోకేశ్ సీరియస్

image

తుని మండలంలోని ఓ విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. బాధితురాలికి సహాయం అందిస్తామని, హాస్టళ్లలో బాలికలకు భద్రత పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.

News October 22, 2025

UPI ధమాకా.. రోజూ ₹94 వేల కోట్ల చెల్లింపులు

image

పండుగ సీజన్‌లో భారీ స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరిగాయి. ఈ నెలలో రోజూ సగటున రూ.94 వేల కోట్ల లావాదేవీలు నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డేటా వెల్లడించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువని తెలిపింది. ఈ నెలలో ఇంకా వారం రోజులకు పైనే ఉండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో డిజిటల్ పేమెంట్స్‌లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతుండటం గమనార్హం.