News February 23, 2026
పత్తి కొనుగోళ్ల ప్రక్రియ పొడగింపు: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో సీసీఐ ద్వారా కొనసాగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియ గడువును పొడిగించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పత్తి సాగు చేసిన రైతుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ వద్ద ఉన్న దిగుబడిని ఈ నెల 27లోపు సమీప కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
Similar News
News February 23, 2026
ఏపీ పోలీసులపై పట్నా హైకోర్టు ఆగ్రహం

IPS సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ విషయంలో AP పోలీసుల తీరుపై పట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అరెస్ట్ వారెంట్ లేదా కేస్ డైరీ వెంట లేకుండా సునీల్‌ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన అరెస్ట్ చెల్లదు. కాగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నిందితుడిగా ఉన్నారు.
News February 23, 2026
ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 28 కేంద్రాల్లో 12,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాల స్పష్టం చేశారు.
News February 23, 2026
శ్రీరామనవమి ఏర్పాట్లపై రేపు సమీక్ష

వచ్చే నెల 27, 28 తేదీల్లో జరిగే శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం, పట్టాభిషేక వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం కానున్నారు. భక్తులకు కల్పించాల్సిన వసతి సౌకర్యాలపై సమగ్ర సమాచారంతో హాజరుకావాలని అధికారులను ఆదేశించారు. వేడుకలను నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.


