News November 21, 2025
పత్తి, వేరుశనగలో ఈ ఎర పంటలతో లాభం

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు.
☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్ర గొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు.
☛ వేరుశనగలో పొగాకు లద్దెపురుగు నివారణకు ఆముదం లేదా పొద్దుతిరుగుడు పంటను ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 100 మొక్కలను ఎర పంటగా వేసుకోవాలి.
Similar News
News November 21, 2025
బరితెగించారు.. మోదీ-మైథిలీపై AI అసభ్యకర వీడియో

AI టెక్నాలజీతో క్రియేటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా పీఎం మోదీ, బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన సింగర్ మైథిలి ఠాకూర్‌పై అసభ్యకర AI వీడియోను రూపొందించి SMలో పెట్టారు. దీన్ని బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే ఆ వీడియోను తొలగించాలని, క్రియేట్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
NOTE: సెన్సిటివిటీ దృష్ట్యా వీడియోను పోస్ట్ చేయలేకపోతున్నాం.
News November 21, 2025
RTC బస్సులో ప్రయాణించిన సీఎం సతీమణి

AP: కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొందారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసి వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
News November 21, 2025
టాటా డిజిటల్‌లో భారీగా లేఆఫ్‌లు

టాటా గ్రూప్‌లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. TCSలో ఉద్యోగుల తొలగింపు తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్‌లోనూ ఎంప్లాయీస్‌ను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. టాటా న్యూ పనితీరు గత రెండేళ్లుగా ఊహించిన స్థాయిలో లేదు. దీంతో కొత్త CEO సజిత్ శివానందన్ పునర్‌వ్యవస్థీకరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా TATA NEUలోని 50% ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.


