News January 27, 2025
పథకాల అమలుకు చొరవ తీసుకుంటా: భూపాలపల్లి కలెక్టర్

జిల్లాలో పథకాల అమలుకు పత్యేక చొరవ తీసుకుంటామని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 20 వరకు నాలుగు సంక్షేమ పథకాల కోసం క్షేత్రస్థాయి విచారణ నిర్వహించిందన్నారు. సంక్షేమ పథకాలు అమలు అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు.
Similar News
News November 10, 2025
ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.
News November 10, 2025
బ్రహ్మాస్త్రం తయారీ.. ఉపయోగించే విధానం

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.
News November 10, 2025
స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 55 పోస్టులు.. అప్లై చేశారా?

ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 55 పోస్టులకు అప్లై చేయడానికి నవంబర్ 13 ఆఖరు తేదీ. ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, ఐటీ, ఎలక్ట్రీషియన్, ఫార్మాసిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18- 35ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.isro.gov.in/.


