News April 20, 2025
పథకాల అమలులో కూటమి విఫలం: వైవీ సుబ్బారెడ్డి

ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎంపీ వై.వి సుబ్బారెడ్డి ఆరోపించారు. గుంటూరు నగర పర్యటనలో భాగంగా శనివారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకాన్ని హామీలకు అనుగుణంగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ శ్రేణులను భయపెట్టేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఫైర్ అయ్యారు.
Similar News
News December 20, 2025
మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో గుంటూరు పోలీసుల పతక వర్షం

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన 44వ ఏపీ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2025లో గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది సత్తా చాటారు. ముగ్గురు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు కలిపి ఆరుగురు పాల్గొని మొత్తం 18 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) సాధించారు. వివిధ వయో విభాగాల్లో ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్లలో మెరిసిన విజేతలను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.
News December 20, 2025
తాడేపల్లి: KCR, KTR ఫొటోలతో జగన్ ఇంటి వద్ద కటౌట్లు

తాడేపల్లిలోని మాజీ CM జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పలు రాజకీయ కటౌట్లు వెలిశాయి. అయితే ఒక కటౌట్‌లో తెలంగాణ మాజీ CM KCR, KTR ఫొటోలూ ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. TGలోని షేర్ లింగంపల్లికి చెందిన BRS నేత చిర్రా రవీందర్ యాదవ్ దీనిని ఏర్పాటు చేశారు. APలోనే కాదు TGలోనూ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
News December 20, 2025
నేడు జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్‌తో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రీసైక్లింగ్, వేస్ట్-టు-వెల్త్ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.


