News January 27, 2025

పథకాల పంపిణీపై ఉద్యోగుల సేవలు భేష్: BPL కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లాలో నాలుగు పథకాల జారీ ప్రక్రియలో భాగస్వాములైన గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.

Similar News

News February 28, 2026

నేడు కాళోజీ కళాక్షేత్రంలో అంతరిక్ష ప్రయోగాలపై సెమినార్

image

అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం మ.2:30 నుంచి 4 వరకు HNK కాళోజీ కళాక్షేత్రంలో సెమినార్ నిర్వహించనున్నారు. అంతరిక్ష ప్రయోగాలపై ప్రముఖ వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం భద్రకాళి బండ్ వద్ద రుద్రమ రాకెట్‌ను ఆవిష్కరించనున్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

News February 28, 2026

రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేత: జగ్గారెడ్డి

image

దేశం కోసం రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా విలువైన సూచనలు ఇస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఇచ్చే సలహాలను ప్రధాని మోదీ వింటున్నారే తప్ప, అమలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

News February 28, 2026

ఆదిలాబాద్: రోబోటిక్స్ కోర్సు దరఖాస్తుకు నేడే ఆఖరు

image

ఆదిలాబాద్‌‌ పట్టణంలోని ATC కేంద్రంలో PMKVY 4.0 కింద ‘ఆటోమోటివ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీర్’ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల కాలపరిమితి గల ఈ స్వల్పకాలిక శిక్షణ ద్వారా అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించవచ్చన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 28 సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.