News January 2, 2026
పదర: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మధు ప్రియ

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బీనమోని మధు ప్రియ జాతీయ స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 4 కి.మీ. పరుగు పందెంలో ఆమె రజత పతకం సాధించారు. ఈ నెల 23 నుంచి జార్ఖండ్‌లో జరిగే జాతీయ పోటీల్లో మధు ప్రియ పాల్గొంటారని కోచ్ పరశురాముడు తెలిపారు. ఆమె ప్రతిభను పలువురు అభినందించారు.
Similar News
News February 19, 2026
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: కలెక్టర్

జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి, క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సమావేశ నిర్ణయాల అమలును సమీక్షిస్తూ.. ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు బ్లాక్ స్పాట్ల గుర్తింపు, నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 19, 2026
NGKL: రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన దివ్యాంగ విద్యార్థులు

హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల విద్యార్థుల క్రీడలలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. క్రీడలలో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం అభినందించారు. జిల్లాకు చెందిన తులసీదర్, నాని, శ్రీ వర్ధన్, విద్యార్థులు క్రీడలలో సత్తా చాటి జిల్లాకు పేరు తేవడం గర్వకారణమని అన్నారు.
News February 19, 2026
అంగన్వాడీల్లో మౌలిక వసతులు కల్పించాలి: సంగారెడ్డి కలెక్టర్

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల్లో సివిల్ వర్క్‌లకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని సూచించారు.


