News March 28, 2025

పదవి కాలం ముగిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కూర రఘోత్తమ రెడ్డికి సన్మానం

image

శాసనమండలిలో పదవి కాలం పూర్తి చేసుకున్న ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కూర రఘోత్తమ రెడ్డిని గురువారం రాత్రి ఘనంగా సత్కరించారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గతంలో కూర రఘోత్తమ రెడ్డి గెలుపొందారు. ఈనెల 29న పదవీకాలం ముగుస్తుండడంతో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూర రఘోత్తమ రెడ్డిని ఘనంగా సత్కరించారు.

Similar News

News September 18, 2025

సర్కారు బడుల్లో నర్సరీ, LKG, UKG.. ప్రభుత్వానికి సిఫార్సు

image

TG: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల వయసును ఆరేళ్లకు (ప్రస్తుతం 5 ఏళ్లు) పెంచాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సర్కారు బడుల్లోనూ నర్సరీ, LKG, UKGని ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రైవేట్ పాఠశాలల్లో మూడేళ్ల నుంచే పిల్లలను చేర్చుకుంటున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి ఇష్టపడటం లేదని కమిషన్ గుర్తించి ఈ సిఫార్సులు చేసింది.

News September 18, 2025

వరంగల్ మార్కెట్లో ధాన్యాల ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం చిరుధాన్యాలు తరలివచ్చాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,500 ధర వస్తే.. పచ్చి పల్లికాయకు రూ.4,100 ధర వచ్చింది. అలాగే మక్కలు (బిల్టీ) రూ.2,280 ధర పలికింది. 5531 రకం మిర్చి క్వింటా రూ.13,200, దీపిక మిర్చి రూ.14 వేలు, పసుపు రూ.10,659 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News September 18, 2025

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

image

సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. జాతీయ రహదారి 65పై జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. పైనుంచి వెళ్లడంతో ఆమె శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.