News March 20, 2025
పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS: వరంగల్ సీపీ

ఈనెల 21 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(144 సెక్షన్) అమలులో ఉంటుందని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా ఉండొద్దని సీపీ సూచించారు.
Similar News
News March 20, 2025
నిజామాబాద్ జిల్లాకు నిరాశ!

రాష్ట్ర బడ్జెట్ నిజామాబాద్ జిల్లా ప్రజలను నిరాశపరిచింది. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టుకు సంబంధించి భూసేకరణ ఊసేలేదు. కాగా శ్రీరాంసాగర్ మెుదటి దశ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించారు. కాగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ.. జిల్లాకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.
News March 20, 2025
వట్టిచెరుకూరు: అత్యాచార ఘటనలో వృద్దుడి మృతి

ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో బాలిక బంధువుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వృద్దుడు మృతి చెందాడు. వట్టిచెరుకూరు సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరు మండలంలో 2వ తరగతి చదువుతున్న బాలికపై థామస్ (60)అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలిక బంధువులు థామస్‌పై దాడి చేయడంతో చికిత్స పొందుతూ మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News March 20, 2025
నిర్మల్: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

నిర్మల్ జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 163 బీఎన్ఎస్ సెక్షన్‌ను అమలు చేస్తున్నామన్నారు.