News November 26, 2025

పదవ తరగతి పరీక్ష ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు: డీఈవో

image

పదవ తరగతి పరీక్ష ఫీజును ఆన్‌లైన్ సేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని పల్నాడు డీఈవో చంద్రకళ తెలిపారు. డిసెంబర్ 1 నుంచి పదవ తేదీ వరకు ఫైన్ లేకుండా చెల్లించవచ్చన్నారు. ఆ తర్వాత 15వ తేదీ వరకు ఫైన్‌తో చెల్లించవచ్చన్నారు. ఎస్ ఎస్ సి వెబ్‌సైట్, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్, ఆన్‌లైన్ పేమెంట్ గేట్ వే ద్వారా కూడా పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈవో తెలియజేశారు.

Similar News

News November 26, 2025

ఫైనల్‌కు ఉమ్మడి ఖమ్మం అండర్-19 గర్ల్స్ జట్టు

image

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న అండర్-19 గర్ల్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి పూల్ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌లో మెదక్ జట్టుపై గెలిచిన ఖమ్మం జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ పోరులో ఖమ్మం, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

News November 26, 2025

సేంద్రియ పెంపకం యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్

image

సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం పాల్వంచ కొత్తూరులోని చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపకం యూనిట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ పద్ధతులు, పరిశుభ్రత ప్రమాణాలు, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ విధానాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

News November 26, 2025

బిడ్డకు జన్మనిచ్చిన ‘బ్లూడ్రమ్’ ముస్కాన్.. DNA టెస్టుకు డిమాండ్

image

UP మీరట్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూడ్రమ్‌లో పాతేసిన <<16560833>>ముస్కాన్<<>> తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త సౌరభ్ పుట్టినరోజునే(NOV 24) బిడ్డ పుట్టడం గమనార్హం. దీంతో ఆ చిన్నారికి DNA టెస్టు నిర్వహించాలంటూ మృతుడి సోదరుడు రాహుల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్ద కూతురు విషయంలోనూ అతను పిల్ వేయగా తీర్పు వెలువడలేదు. వారిద్దరూ సౌరభ్ పిల్లలుగా తేలితే తామే పోషిస్తామని అతను చెబుతున్నాడు.