News April 25, 2024
‘పది’లో జిల్లా టాపర్ ప్రసన్నకు డీఈవో అభినందనలు

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన గుడివాడకు చెందిన ఏకేటీపీ ఎంజీహెచ్ హై స్కూల్ విద్యార్థి అల్లంపల్లి భాను ప్రసన్నను జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా అభినందించారు. మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో ప్రసన్నను ఆమె సత్కరించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రసన్న 590 మార్కులు సాధించారు.
Similar News
News October 13, 2025
షాపింగ్ ఉత్సవ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి: జేసీ

మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 13న ప్రారంభం కానున్న షాపింగ్ ఉత్సవ్ ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను ఆదివారం ఆయన సమీక్షించారు. ఉత్సవ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తిచేయాలని సూచించారు.
News October 12, 2025
గన్నవరం జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరి మృతి

గన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో ఆదివారం ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. సైకిల్ పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా లారీ ఢీకొట్టింది. లారీ చక్రాలు మృతిని పై నుంచి వెళ్లడంతో అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు గన్నవరంలో ముఠా పని చేస్తుంటాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 12, 2025
‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి’

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యులైన మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. రంగా పేరుతో జిల్లా పట్టాలని గత ప్రభుత్వానికి 7వేల దరఖాస్తులు ఇచ్చినా పెడ చెవిన పెట్టిందన్నారు.