News March 6, 2025
పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: ADB కలెక్టర్

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి సమావేశం నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 10,106 మంది పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 14, 2025
విజయోత్సవ ర్యాలీలు వద్దు: అదనపు ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్, 223 బీఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల అనుమతితో, నిర్దేశించిన రోజున మాత్రమే ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం బేల, జైనథ్, భీంపూర్, తాంకో, ఆదిలాబాద్(రూ), మావల మండలాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం

సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆత్రం నగేశ్ గెలుపొందారు. ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ నగేశ్‌ను పలువురు అభినందించారు.
News December 14, 2025
83.80 శాతం పోలింగ్ నమోదు

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.


