News March 13, 2025
పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలను పక్కడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. పది పరీక్షలపై గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అసౌకర్యం కలకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News March 14, 2025
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.
News March 14, 2025
మంగపేట: చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

మంగపేట మండలం బాలన్నగూడెంకు చెందిన దన్నూరి సాయికుమార్ (22) ద్విచక్ర వాహనంపై కరకగూడెం మండలం చొప్పల గ్రామంలో జరుగుతున్న ముసలమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నరసాపూర్ వద్ద చెట్టుకు ఢీ కొట్టి అక్కడికి అక్కడికే మృతి చెందాడు. బైకుపై ఉన్న ఇంకో యువకుడు దోమల గ్రామానికి చెందిన పాయం నితిన్ తీవ్ర గాయాలు కాగా అతన్ని స్థానికులు ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 14, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రామగిరి 40.2℃ నమోదు కాగా మంథని 40.1, అంతర్గం 40.0, ముత్తారం 39.9, పాలకుర్తి 39.7, కమాన్పూర్ 39.6, రామగుండం 39.5, పెద్దపల్లి 39.5, కాల్వ శ్రీరాంపూర్ 39.4, సుల్తానాబాద్ 39.3, ఓదెల 39.3, ధర్మారం 38.6, జూలపల్లి 36.7, ఎలిగేడు 36.5℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.