News March 2, 2025

పది పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు. చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీప్ సూపర్డెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు కస్టోడియన్‌లతో సమావేశం నిర్వహించారు. డీఈఓ రాధాకృష్ణ, రాజిరెడ్డి, సుదర్శన్ మూర్తి తదితరులున్నారు.

Similar News

News September 13, 2025

రాష్ట్ర కళా ఉత్సవ్‌కు మెదక్ జిల్లా విద్యార్థులు ఎంపిక

image

రాష్ట్ర స్థాయిలో జరిగే కళా ఉత్సవ్-2025 పోటీలకు మెదక్ జిల్లా నుంచి పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని డీఈఓ రాధా కిషన్ తెలిపారు. వ్యక్తిగత విభాగంలో ఎస్. కౌడిపల్లి, బాలాజీ, శ్రీహర్షిని, ఆర్తిచంద్ర, సాత్విక్ ఎంపిక కాగా, బృందంలో స్పందన, మహేష్, కావేరి, సుర్తిత్రిక, పవన్ ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. వీరిని డీఈఓ , పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

News September 12, 2025

పెద్ద శంకరంపేట : మనస్థాపంతో బావిలో దూకి యువకుడి మృతి

image

పెద్ద శంకరంపేట మండలంలోని ముసపేటకి చెందిన గంగమేశ్వర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిఅతడు తిరిగి రాలేదు. గంగమేశ్వర్ ఇటీవల ఓ కేసులో జైలుకు వెళ్ళి పది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మనస్థాపంతోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 12, 2025

ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మెదక్ మున్సిపాలిటీలోని గోల్కొండ వీధి, గాంధీనగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను రక్షించడానికి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు.