News April 24, 2024
‘పది’ ఫలితాల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా 4వ స్థానం

☞ ‘పది’లో 91.88 శాతం ఉత్తీర్ణతతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రంలోనే 4న స్థానంలో నిలిచింది. 18,787 మంది పరీక్షలు రాయగా.. 17,262 (BOYS-8,551, GIRLS-8,711) మంది పాసయ్యారు.
☞ తూ.గో: 23,367 మందికి గానూ 19,414 (BOYS-9,648, GIRLS-9,793) మంది ఉత్తీర్ణులయ్యారు. 83.2శాతంతో 21వ స్థానం.
☞ కాకినాడ: 27,671 మంది పరీక్షలు రాయగా.. 22,993 (BOYS-10,958, GIRLS-12,035) మంది పాసయ్యారు. 83.09శాతంతో 22వ స్థానంలో ఉంది.
Similar News
News October 11, 2025
14న రాజమండ్రిలో జాబ్ మేళా

రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో మంగళవారం ప్రముఖ వాయుపుత్ర మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీఎంఎస్) కంపెనీలో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. 2020–2025 మధ్య డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News October 11, 2025
పాపికొండల విహారయాత్ర స్టార్ట్

గోదావరి వరదల నేపథ్యంలో నిలిచిన పాపికొండల విహారయాత్రను మొదలెట్టేందుకు శనివారం నుంచి అనుమతి ఇచ్చామని జలవనరుల శాఖ ఏఈ భాస్కర్ తెలిపారు. నదిలో వరద కారణంగా జులై 11వ తేదీన విహారయాత్ర బోట్లను నిలిపి వేశారు. 3 నెలల అనంతరం మళ్లీ పాపికొండల అందాలను చూసేందుకు టూరిస్టులకు అవకాశం లభించింది. గండి పోచమ్మ ఆలయం, పురుషోత్త పట్టణం నుంచి బోట్లు బయలుదేరనున్నాయి.
News October 11, 2025
యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు -DCHS ప్రియాంక

తూ.గో జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పరిధిలో ఉచిత వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని DCHS ప్రియాంక తెలిపారు. సమ్మె ప్రభావం కారణంగా జిల్లా ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకావొద్దన్నారు. సాధారణంగా ఉచిత వైద్య సేవలను పొందవచ్చునని తెలిపారు. రోగులకు ప్రతి విభాగంలో ఉచిత వైద్య సేవలు అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యలుంటే 9281068129, 9281068159 నంబర్లలో సంప్రదించాలన్నారు.