News May 1, 2024
పది ఫలితాల్లో ఖమ్మం జిల్లా వెనుకంజ

పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెరిగినా రాష్ట్రంలో ర్యాంక్ మాత్రం పడిపోయింది. గతేడాది 88.72 శాతం ఉత్తీర్ణత సాధించగా జిల్లా రాష్ట్రస్థాయిలో 18వ స్థానంలో నిలిచింది. ఈసారి 92.24% ఉత్తీర్ణత నమోదైనప్పటికీ రాష్ట్రస్థాయిలో ర్యాంక్ మాత్రం 21వ స్థానానికి పడిపోవడం గమనార్హం. జిల్లాలో మొత్తం 16,541 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 15,258 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది.
Similar News
News April 13, 2026
ఖమ్మం: నేటి నుంచే రీకౌంటింగ్ దరఖాస్తులు

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలో 72.06% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో, ద్వితీయ సంవత్సరంలో 81.60%తో 6వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం నేటి నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈఓ రవిబాబు తెలిపారు. మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు నిరుత్సాహపడకుండా సిద్ధం కావాలని ఆయన సూచించారు.

News April 12, 2026
మధిర: ఇంటర్ రిజల్ట్.. 1000/992 మార్కులు

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.