News March 15, 2025

పది ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి: జడ్పీ ఛైర్‌పర్సన్

image

ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలవాలని కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ మీటింగ్ హాలులో 1 నుంచి 7 వరకు జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు చైర్ పర్సన్ ఆధ్వర్యంలో జరిగాయి. తొలుత జడ్పీ చైర్ పర్సన్ జడ్పీటీసీలు, జిల్లా అధికారులచే స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.

Similar News

News March 15, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* పదిలో మెరుగైన ఫలితాలు సాధించాలి: జడ్పీ చైర్పర్సన్ * కృష్ణా: ముగిసిన ఇంటర్ పరీక్షలు * నేను పిఠాపురం MLA గారి తాలూకా: ఎంపీ బాలశౌరి* బందరు బైపాస్‌లో ప్రమాదం.. ఒకరు మృతి * లింగవరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ * నేటి నుంచి ఒంటి పూట బడులు * జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర

News March 15, 2025

కృష్ణా: నేటి నుంచి ఒంటి పూట బడులు

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి జిల్లాలో ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7:45నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాయని పేర్కొన్నారు. 

News March 14, 2025

బాపులపాడులో రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

error: Content is protected !!