News April 2, 2025
పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 16, 2025
అనకాపల్లి: రేషన్ షాపులకు ఈ-పాస్ పరికరాలు

జిల్లాలో రేషన్ షాపులకు అధునాతనమైన ఈ-పాస్ పరికరాలను అందజేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ జాహ్నవి తెలిపారు. కలెక్టరేట్లో డీలర్లకు మంగళవారం ఈ-పాస్ మిషన్లు అందజేశారు. వినియోగదారులకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించినందుకు జిల్లాలో 1069 రేషన్ షాపులకు వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.
News September 16, 2025
సిద్ధిపేట: ‘కేసులను త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి’

SC, ST కేసులలో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని సీపీ కమిషనర్ అనురాధ ACPకి సూచించారు. మంగళవారం ఏసీపీ ఆఫీసును సీపీ సందర్శించి రికార్డ్స్, క్రైమ్ ఫైల్స్ తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న OE త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఏసీపీ రవీందర్ రెడ్డి టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీఆర్పీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News September 16, 2025
మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

మాడ్యులర్ కిచెన్‌కు ఈ రోజుల్లో ఆదరణ పెరుగుతోంది. అయితే కిచెన్‌కి వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరకులు పెట్టుకోవడానికి అల్మారా, డీప్ డ్రా నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనేలా ఉండాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.