News February 11, 2025
పదీ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739195168003_51732952-normal-WIFI.webp)
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 10,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు. పరీక్ష కేంద్రాల ద్వారా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
Similar News
News February 11, 2025
ఆ చట్టం రద్దుతో అదానీకి ప్రయోజనం!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739256392932_1199-normal-WIFI.webp)
డొనాల్డ్ ట్రంప్ <<15426089>>FCPA<<>> చట్టాన్ని సస్పెండ్ చేయడంతో భారత వ్యాపారి గౌతమ్ అదానీకి ఊరట లభించే అవకాశముంది. ఇప్పటికిప్పుడు అభియోగాలను రద్దుచేసే అవకాశమైతే లేదు గానీ విచారణను నిలిపివేస్తారు. అటార్నీ జనరల్ పామ్ బొండి సవరణలతో కూడిన చట్టాన్ని తీసుకురాగానే దాని ఆధారంగా విచారణ ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం కోసం నజరానాలు ఇవ్వడం నేరం కాదని ట్రంప్ నొక్కి చెబుతుండటంతో చట్టం తీరుతెన్నులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
News February 11, 2025
NTR: రైలు కిందపడి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739257491291_1240-normal-WIFI.webp)
రైలు కిందపడి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన TSలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ తెలంగాణలోని మధిర రైల్వే స్టేషన్ పరిధిలో జైపూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ కిందపడ్డాడు. దీంతో అతని తల తెగిపోయింది. లోకో ఫైలట్ సమాచారంతో ఖమ్మం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 11, 2025
HYD: డ్రైవింగ్‌లో యువత బాధ్యతగా వ్యవహరించాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739243037710_51765059-normal-WIFI.webp)
‘తల్లిదండ్రుల్లారా, మీ పిల్లలకు వాహనాలు కొనిచ్చి మురిసిపోవడం కాదు. రోడ్లపై వాళ్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా? లేదా? తెలుసుకోండి’ అని టీజీఆర్టీసీ ఛైర్మన్ సజ్జనార్ తెలిపారు. యథేచ్ఛగా త్రిపుల్ రైడింగ్ చేస్తూ తప్పించుకునేందుకు రకరకాల విన్యాసాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగితే ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించాలన్నారు. డ్రైవింగ్ విషయంలో యువత బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.