News July 3, 2024

పదేళ్లలో BRS ప్రభుత్వం యువతకు ఏం చేసింది:పొంగులేటి

image

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని 6 నెలలు అయిందన్నారు. రైతులకు రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టామని, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. యువతను ప్రతిపక్షం రెచ్చగొడుతుందని, పదేళ్ల BRS ప్రభుత్వం యువతకు ఏం చేసిందని ప్రశ్నించారు.

Similar News

News July 5, 2024

వేరుశనగ నూనె ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం

image

కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

News July 5, 2024

ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి తుమ్మల

image

టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్స్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 

News July 5, 2024

రేపు ఉమ్మడి జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు

image

కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్లో ఈ నెల 6న ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల స్విమ్మింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.హన్మంతరాజు తెలిపారు. ఇక్కడ ఎంపిక చేసే జట్టును ఈ నెల 13, 14వ తేదీల్లో సికింద్రాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు.