News June 1, 2024

పదేళ్లు: హైదరాబాద్‌లో పెను మార్పు!

image

TG ఏర్పాటైన‌ పదేళ్లలో ప్రపంచ నగరాలతో‌ HYD పోటీ పడిందని చెప్పొచ్చు. వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డ్‌ (2022) గెలుచుకోవడం ఇందుకు నిదర్శనం. HYD‌లో జరిగిన కీలక ఘట్టాలు.. 1. మెట్రో‌ ప్రారంభం, 2. SRDP‌తో 36 ఫ్లై ఓవర్లు, 3. ట్యాంక్‌బండ్, HMDA పార్కుల సుందరీకరణ, 5. కేబుల్ బ్రిడ్జి, 6. IT కారిడార్‌, 7. నూతన సెక్రటేరియట్, 8. అమరవీరుల స్తూపం, 9. అంబేడ్కర్ విగ్రహం, 10. SNDP పనులు. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News September 30, 2024

BREAKING: HYD: కాసేపట్లో DSC ఫలితాలు విడుదల

image

DSC ఫలితాలు మరికొద్ది క్షణాల్లో విడుదల కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 నెలల క్రితం పూర్తయిన DSC పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. కాగా, 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

News September 30, 2024

HYD: సామాన్యుడి బతుకుబండి బరువేక్కుతుంది..!

image

‘కూటి కోసం కోటి తిప్పలు’ అన్నట్లు పట్టణాలకు వలస వచ్చిన పేదల బతుకు బండి బరువెక్కుతోంది. చిన్నాచితక పనిలో రూ.10-15 వేల అరకొర జీతంతో కుటుంబాన్ని ముందుకు నడుపుతున్న వేళ కూరగాయల, నిత్యావసరాల ధరలు పెరగటంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు ఇంటి రెంట్, పిల్లల చదువులు, దవాఖాన ఖర్చులు ఇలా నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ మిగలడంలేదని సగటు వ్యక్తి ఆవేదన.

News September 30, 2024

HYD: కొండెక్కిన కూరగాయల ధరలు..!

image

HYDలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం 3 రోజుల్లోనే 20 % మేరకు ధరలు పెరిగినట్లు విక్రయదారులు తెలిపారు. ఉప్పల్ మార్కెట్లో టమాటా కిలో-70, వంకాయ-80 బెండకాయ-60, చిక్కుడు కాయ-60, దొండకాయ-60, పచ్చిమిర్చి-30, క్యాప్సికం-80 కాకరకాయ-60, గోరుచిక్కుడు-60, సొరకాయ ఒకటి 30-40, ఆలుగడ్డ-50-60, బీరకాయ- రూ.70-80గా ఉంది. నగరంలోని వివిధ మార్కెట్లలో రూ.10-20 వ్యత్యాసం ఉన్నట్లుగా పేర్కొన్నారు.