News April 11, 2025

పదోన్నతి బాధ్యత మరింత పెంచుతుంది: ASF SP

image

పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెరుగుతుందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వర్తిస్తూ ఆరుగురు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి కలిశారు.

Similar News

News February 17, 2026

VZM: రైల్వే పోలీసుల ఫోన్ నంబర్లు మారాయి..

image

విజయనగరం రైల్వే పోలీసుల (GRP) ఫోన్ నంబర్లు మారాయి. టెలికాం సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి కొత్త నంబర్ల కేటాయింపు జరిగింది. అందులో భాగంగా ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ హోదాల్లో ఉన్న వారికి మాత్రమే నంబర్లు వినియోగించుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా విజయనగరం రైల్వే ఎస్‌ఐ 9247585742, పలస ఎస్‌ఐ 9247585743, ఆమదాలవలస ఎస్‌ఐ 9247585744 నంబర్లలో అందుబాటులో ఉంటారు.

News February 17, 2026

అజిత్ పవార్ మృతి.. కీలక పరిణామం

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ <<19106331>>మృతి కేసులో<<>> కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంపై సీబీఐ విచారణ చేయాలని ఆయన భార్య, Dy.CM సునేత్రా పవార్ డిమాండ్ చేశారు. NCP లీడర్లు, పెద్ద కుమారుడు పార్థ్‌తో ఆమె సీఎం ఫడణవీస్‌ను కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. ‘ఈ విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తామన్నారు’ అని NCP నేత సునీల్ వెల్లడించారు.

News February 17, 2026

రేపు సెలవు కానీ పరీక్షలు యథాతథం: ADB కలెక్టర్

image

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 18న జిల్లాలో స్థానిక సెలవు ప్రకటించబడినప్పటికీ, అదే రోజున నిర్వహించాల్సిన ఎస్సెస్సీ ప్రీ–ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయబడవన్నారు. జిల్లాలోని MEOలు, HMలు, SOలు, TGMS ప్రిన్సిపల్స్ పరీక్షలు నిర్ణీత టైమ్‌టేబుల్ ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.