News January 27, 2025
పదోన్నతులతో పాటు బాధ్యత పెరుగుతుంది: ASF SP

పదోన్నతులతో బాధ్యత పెరుగుతుందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ముగ్గురు ఏఎస్ఐలుగా పదోన్నతులు పొందారు. వారిని ఎస్పీ అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కి వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
Similar News
News November 13, 2025
మూడేళ్లు జైల్లో గడిపిన అల్-ఫలాహ్ ఫౌండర్!

అల్-<<18273804>>ఫలాహ్<<>> యూనివర్సిటీ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ జావేద్ అహ్మద్ సిద్ధిఖీ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. MPలో జన్మించిన సిద్ధిఖీ గతంలో 9 సంస్థలను నడిపారు. వాటిలో చాలా వరకు 2019 తరువాత మూసివేశారు. చీటింగ్, నకిలీ పత్రాలు సృష్టి, నిధుల మళ్లింపు వంటి అనేక ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. రూ.7.5 కోట్ల చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష సైతం అనుభవించారు. దీంతో వర్సిటీ నిధులపై ED దర్యాప్తు చేస్తోంది.
News November 13, 2025
వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు: KTR

తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతిని కేసీఆర్ తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టారని, వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారని కేటీఆర్ ‘X’లో పేర్కొన్నారు.
News November 13, 2025
క్వాలిటీ స్పిన్నర్ల కోసం ముంబై వేట!

IPL: వచ్చే వేలానికి ముందు క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి మయాంక్ మార్కండే, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి రాహుల్ చాహర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ ముంబై తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నారు. మయాంక్ 37 మ్యాచుల్లో 37, రాహుల్ 78 మ్యాచుల్లో 75 వికెట్లు తీశారు.


