News February 23, 2026

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు 133 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 136 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 62 మంది కస్టోడియన్లను నియమించినట్లు పేర్కొన్నారు. మాల్‌ప్రాక్టీస్ నిరోధానికి ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రవాణా సౌలభ్యం కోసం 11 మంది రూట్ అధికారులను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.

Similar News

News February 25, 2026

జనగామ జిల్లాలో 16 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

image

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు మొత్తం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా జనగామ పట్టణంలో 8 కేంద్రాలుండగా, స్టేషన్ ఘనపూర్‌లో 3, నర్మేట, జఫర్‌గఢ్, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో ఒక్కో కేంద్రం చొప్పున కేటాయించారు. పరీక్షల పర్యవేక్షణకు 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించారు.

News February 25, 2026

మా రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా ఎందుకు మార్చట్లేదు: మమత

image

కేరళ పేరును <<19227139>>కేరళంగా<<>> మార్చడాన్ని WB సీఎం మమత స్వాగతించారు. తమ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని కేంద్రానికి 3సార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమ కల్చర్‌ను పరిగణనలోకి తీసుకొని ‘బంగ్లా’ పేరు పెట్టాలనుకున్నట్లు తెలిపారు. ‘మా విద్యార్థులు పరీక్షకు వెళితే అక్షర క్రమంలో(West Bengal) చివర్లో కూర్చోవాలి. CMగా నాకూ ఇదే పరిస్థితి. మేమెందుకు చివర్లోనే ఉండాలి’ అని ప్రశ్నించారు.

News February 25, 2026

HNK: సందేహాలు, సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్లు

image

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎక్కడైనా విద్యార్థులు ఆందోళనకు గురై మానసిక సమస్యలు ఎదురైతే వెంటనే 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని హనుమకొండ జిల్లా డీఐఈవో గోపాల్ సూచించారు. అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏవైనా సందేహాలు ఉంటే 92402 05555 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. సకాలానికి విద్యార్థులు సెంటర్లకు చేరుకొని ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలన్నారు.