News March 19, 2024
పదో తరగతి పరీక్షలు..మొదటి రోజు 99.61% హాజరు

MBNR:పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు మొత్తం 12,738 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు 58 కేంద్రాలు ఏర్పాటు చేయగా గతంలో అనుత్తీర్ణులై మళ్లీ ఫీజు చెల్లించిన వారికి ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.జిల్లా కలెక్టర్ రవినాయక్-2,జిల్లాస్థాయిఅధికారులు-7,DEO రవీందర్-6,ప్లయింగ్ స్క్వాడ్స్ 24 కేంద్రాలను తనిఖీ చేశాయి.
Similar News
News August 16, 2025
MBNR: పనులకు శ్రీకారం చుట్టిన ఎంపీ డీకే అరుణ

అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆమె MBNR జిల్లాలోని చిన్న చింతకుంటలో పర్యటించారు. రూ.18 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న రెండు కమ్యూనిటీ హాళ్ల పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. వాల్మీకి దేవాలయం, మాతా గంగా భవాని ఆలయాల్లో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.65 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.
News August 16, 2025
పాలమూరు: అథ్లెటిక్స్.. రేపే ఎంపికలు

MBNRలోని DSA స్టేడియంలో అథ్లెటిక్స్ ఎంపికలు రేపు ఉ. 9:00 గం.కు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్ చంద్ర Way2Newsతో తెలిపారు. అండర్-14, 16, 18,& 20 బాల బాలికలకు విభాగాల్లో ఎంపికలు ఉంటాయని, ఆసక్తిగల విద్యార్థులు టెన్త్ మెమో, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్తో అథ్లెటిక్ కోచ్ సునీల్ కుమార్కు రిపోర్ట్ చేయాలన్నారు. మిగతా వివరాలకు 94406 56162, 98497 06360 సంప్రదించాలన్నారు. SHARE IT
News August 16, 2025
NRPT: 20న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

NRPTలోని మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఈనెల 20న బాల,బాలికలకు అండర్-14, 16,18,20 ఎంపికలు ఉంటాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ Way2Newsతో తెలిపారు. U-14(15-10-2011/14-10-2023), U-16(15-10-2009/14-10-2011), U-18(15-10-2007/14-10-2009), U-20(15-10-2005/14-10-2007) మధ్య జన్మించి ఉండాలని, పూర్తి వివరాలకు 91007 53683,90593 25183 సంప్రదించాలన్నారు.