News March 18, 2024

పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి ప్రాథమిక హైస్కూలులో సోమవారం కలెక్టర్ అరుణ్ బాబు పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను తనిఖీ చేశారు. సత్యసాయి జిల్లాలో మొదటి రోజు తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్డిఓ భాగ్యరేఖ, డిఇఓ మీనాక్షి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 25, 2025

ఆ ట్విటర్ అకౌంట్‌ నాది కాదు: ఎమ్మెల్యే దగ్గుబాటి

image

తన పేరుతో ఫేక్ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు ట్వీట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ప్రతిపక్ష నేతలు తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఫేక్ అకౌంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. <<17822177>>ఫేక్<<>> అకౌంట్‌ను కూటమి నాయకులు ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు.

News September 25, 2025

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘ఆప్’ పోటీ: జిల్లా అధ్యక్షుడు

image

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు జిల్లా కన్వీనర్ బి.వెంకటరమణ బాబు స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు. రాయదుర్గం, గుంతకల్లు, అనంతపురం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లోనూ పోటీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గౌస్, రాంమోహన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

News September 23, 2025

కనకదుర్గమ్మను దర్శించుకున్న మన ఎమ్మెల్యేలు

image

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను మంత్రి సవిత, రాప్తాడు MLA పరిటాల సునీత, శింగనమల MLA బండారు శ్రావణి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.