News December 6, 2025

‘పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి’

image

పదో తరగతిలో విద్యార్థులు ఈ సంవత్సరం నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఎంఈఓలు ఇతర అధికారులతో కలెక్టర్ శనివాకం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు సమాజంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక బాధ్యతను విద్యార్థులకు తెలియజేయాలన్నారు.

Similar News

News April 15, 2026

యుద్ధం.. 4 పాయింట్లతో చైనా పీస్ ప్లాన్!

image

ఇరాన్, US మరోసారి చర్చలకు యత్నిస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 4 పాయింట్లతో పీస్ ప్లాన్ సూచించారు. ‘పశ్చిమాసియా, గల్ఫ్‌లో సుస్థిర భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు దేశాలు బంధాలు మెరుగుపరుచుకోవాలి. దేశాల జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి కేంద్రంగా అంతర్జాతీయ వ్యవస్థను దృఢంగా నిలబెట్టాలి. అన్ని దేశాలు అభివృద్ధిని భద్రతతో అనుసంధానించాలి. ఇందుకు మేం సాయపడతాం’ అని పేర్కొన్నారు.

News April 15, 2026

SSS: జిల్లా వ్యాప్తంగా తనిఖీలు.. RMP క్లినిక్‌ల‌కు షోకాజ్ నోటీసులు

image

శ్రీ సత్యసాయి కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపి క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పెనుకొండ డివిజన్‌లో 2 క్లినిక్‌లు, కదిరి డివిజన్‌లో 2, పుట్టపర్తి డివిజన్‌లో 1 RMP క్లినిక్‌‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ లు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 15, 2026

GK: తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరు?

image

☛ కంప్యూటర్ పితామహుడు-చార్లెస్ బాబేజ్
☛ ఆధునిక కంప్యూటర్ పితామహుడు-అలాన్ ట్యూరింగ్
☛ మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్-అడా లవ్‌లేస్ (ఫొటోలో)
☛ మొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్-ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ (ENIAC)
☛ కంప్యూటర్ మెదడు అని దేనిని పిలుస్తారు-CPU (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్)
☛ 1024 MB: 1 GB (గిగాబైట్)
☛ 1024 GB: 1 TB (టెరాబైట్)