News March 2, 2025
పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ ‘విజయోస్తు’ లేఖ

ఈనెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షకు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వయంగా లిఖించి ముద్రించిన ‘ విజయోస్తు ‘ లేఖలను విద్యార్థులకు అందిస్తున్నారు. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు కావాల్సిన పంచసూత్రాలను పాటిస్తూ చదవాలని లేఖలో పొందుపరిచారు. జిల్లాలోని ప్రతి విద్యార్థికి ఈ లేఖలను కలెక్టర్ అందించి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Similar News
News November 14, 2025
డెలివరీ తర్వాత ఇలా చేయండి

బిడ్డను ప్రసవించిన గంటలోపే శిశువుకు తల్లి పాలు పట్టించాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే తల్లి డీహైడ్రేట్ అవ్వకుండా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. సాధారణ ప్రసవం తర్వాత చాలావరకు ఇబ్బందులు తలెత్తవు. సిజేరియన్ జరిగితే మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. శరీరానికి విశ్రాంతి అవసరం. సిజేరియన్ జరిగితే మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాలి.
News November 14, 2025
GREAT: ఎకరంలో 400 రకాల వరి వంగడాల సాగు

ఒకే ఎకరంలో 400 దేశవాళీ వరి రకాలను సాగు చేస్తున్నారు TGలోని పెద్దపల్లి(D) కల్వచర్లకు చెందిన యాదగిరి శ్రీనివాస్. ఈయన AEOగా పనిచేస్తున్నారు. 2016 నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ప.బెంగాల్, తమిళనాడు నుంచి 400 రకాల దేశవాళీ వరి విత్తనాలను సేకరించి.. ఎకరం పొలంలో ఒక్కో రకాన్ని 10 చ.మీటర్ల విస్తీర్ణంలో సేంద్రియ విధానంలో పండిస్తున్నారు.✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 14, 2025
కేఎంసీలో స్టాఫ్ నర్స్ పోస్టులు

కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) పరిధిలోని పీఎంఎస్‌ఎస్‌ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో 19 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య తెలిపారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికంగా ఉండి, 2026 మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. దరఖాస్తులను కేఎంసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని ఆమె సూచించారు.


