News November 28, 2024

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వర్చువల్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు వర్చువల్ విధానం ద్వారా నాణ్యమైన బోధన అందించాలని సూచించారు.

Similar News

News November 28, 2024

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి: కలెక్టర్

image

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధిపై జేసీ సీ.విష్ణు చరణ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారి రాము నాయక్, తదితర అధికారులు ఉన్నారు.

News November 28, 2024

జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం: టీడీపీ

image

సంఘసంస్కర్త, సామాజికవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దామని టీడీపీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా గురువారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి నివాళులు అర్పించారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజిక వర్గ విభేదాలను రూపుమాపేందుకు పూలే పోరాటం సలిపారన్నారు.

News November 28, 2024

బేతంచెర్లలో యువకుడి ఆత్మహత్య

image

బేతంచెర్లలో నివాసం ఉంటున్న షేక్ హిమాయత్ (26) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖరప్ప వివరాల మేరకు.. ఈ నెల 25న అదృశ్యమైన ఆయన నిన్న ఇంటికి వచ్చారు. నాపరాయ పరిశ్రమలో నష్టాలు రావడంతో మనస్తాపానికి గురై ఇవాళ ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. కాగా ఆయన భార్య కుబ్రా రెండు సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఈ ఘటనపై హిమాయత్ తండ్రి మహమ్మద్ రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.