News October 12, 2025

పదో వసంతంలోకి మెదక్ జిల్లా..!

image

MDK జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటైంది. నిన్నటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న జిల్లా నేటి నుంచి పదో వసంతంలోకి అడుగు పెట్టింది. కాగా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత అభివృద్ధి పనులు జరిగాయని కొందరు.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మరికొందరు అంటున్నారు. గ్రామీణ రోడ్లు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, హాస్టళ్లు సరిగా లేవని చెబుతున్నారు. మీ జిల్లా అభివృద్ధి అయ్యిందా కామెంట్ చేయండి.

Similar News

News October 12, 2025

పీఆర్టీయూ మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా మేడి సతీశ్‌రావు ఎన్నిక

image

పీఆర్టీయూ మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా మేడి సతీశ్‌రావు ఎన్నికయ్యారు. జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. సతీశ్‌రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని, అదే విధంగా సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

News October 12, 2025

మెదక్: నేడు కాంగ్రెస్ సమావేశానికి ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు రాక

image

ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు, ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా ఈనెల 12న మెదక్ వినాయక ఫంక్షన్‌ హాల్‌లో జరిగే కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో స్టేట్ అబ్జర్వర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్ పాల్గొననున్నారు.

News October 12, 2025

MDK: హైకోర్టు స్టే.. BCల్లో నిరాశ.!

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోకు హైకోర్టు స్టే విధించడంతో BC వర్గాల్లో నిరాశ నెలకొంది. అదే సమయంలో జనరల్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ZPTC స్థానాల్లో రెండు, మూడు మాత్రమే జనరల్‌కు కేటాయించడంతో వారు ఇప్పటివరకు నిరుత్సాహంలో ఉన్నారు. పాత రిజర్వేషన్లు అమలైతే తమకు పోటీ చేసే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.