News January 16, 2026
పద్ధతిగా ఉండమంటే కేసు పెడతారా?: సంధ్య

TG: తన వ్యాఖ్యలపై నటి అనసూయ <<18872663>>కేసు<<>> పెట్టడంపై కాంగ్రెస్ నేత బొజ్జ సంధ్య స్పందించారు. ‘పద్ధతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? కేసులు ఎదుర్కొనే దమ్ము నాకు ఉంది. SMలో తల్లిదండ్రులు నా దృష్టికి తెచ్చిన విషయాన్నే ప్రస్తావించా. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదగడమే. దుస్తుల్లో స్వేచ్ఛలేదు’ అని ఆమె స్పష్టం చేశారు. కాగా అనసూయ ఫిర్యాదుతో వివిధ ఛానళ్ల యాంకర్లు సహా 73 మందిపై కేసు నమోదైంది.
Similar News
News February 26, 2026
నేడు పిడుగులతో కూడిన వర్షాలు

AP, TGలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు కురుస్తున్నాయి. వేసవిలో కురిసే రుతుపవన ముందస్తు వర్షాలు ఈసారి ముందుగానే పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ద్రోణి ప్రభావంతో ఇవాళ APలోని శ్రీకాకుళం, ఉ.గో, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని IMD వెల్లడించింది. TGలోని రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News February 26, 2026
బ్రహ్మాస్త్రం తయారీ.. ఎలా ఉపయోగించాలి?

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.
News February 26, 2026
10 కోట్ల ఫాలోవర్లతో ఇన్‌స్టాలో మోదీ రికార్డ్

ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల ఫాలోవర్స్ మార్క్‌ని దాటిన తొలి వరల్డ్ లీడర్‌గా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 4.3 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (1.5 కోట్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (1.44 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతలతో పోలిస్తే మోదీకి రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం విశేషం.


