News November 19, 2025
పద్మనాభంలో స్వామి ఉత్సవం ఎలా ప్రారంభమైంది?

పద్మనాభంలోని గిరి ప్రాంతంలో 1938లో విజయనగరం పాలకుడు పూసపాటి అలక్ నారాయణ గజపతి ఆనతి మేరకు ద్రాక్షారామం నుంచి వచ్చిన చేకూరి, బుల్లి సత్యనారాయణరాజు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి యజ్ఞాలు నిర్వహించేవారు. ఆఖరిరోజు అనంతుని కొండ మెట్ల పంక్తికి దీపోత్సవాన్ని నిర్వహించేవారు. కొంతకాలం ఉత్సవం నిలిచినా..1987లో ఆలయ అర్చకుడు కృష్ణమాచార్యుల సూచనల మేరకు పునఃప్రారంభించారు.
Similar News
News February 10, 2026
విశాఖ: జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశం 28న

జీవీఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 28న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. అజెండా సిద్ధం చేసి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం వచ్చేనెల 17తో ముగియనుండటంతో, ఈ సమావేశమే చివరిదిగా నిలవనుంది. ప్రతి సభ్యుడు మాట్లాడేలా వరుసగా రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో అజెండాలో భారీగా అంశాలు చేర్చే అవకాశముందని అధికారులు తెలిపారు.
News February 10, 2026
తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో విశాఖ అగ్రస్థానం

విశాఖ జిల్లా తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో జరిగిన సమీక్షలో జిల్లాల పనితీరును పరిశీలించారు. 2025-26లో విశాఖ స్థూల ఉత్పత్తి రూ.1.60 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.6.58 లక్షలుగా నమోదైంది. గాజువాక నియోజకవర్గానికి ఏ+ గ్రేడ్ లభించింది. విశాఖలో రిజిస్ట్రేషన్ కేంద్రం, ఎమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటుపై సూచనలు చేశారు.
News February 10, 2026
విశాఖ ఉక్కులో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టెండర్లు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మరో కీలక అడుగు పడింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణతో పాటు కోల్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేటుకు అప్పగించేందుకు ఆర్ఐఎన్ఎల్ టెండర్లు ఆహ్వానించింది. క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను రెండేళ్లకు రూ.83.52 కోట్లతో నిర్వహించనుంది. అధిక విద్యుత్ వ్యయంతో ఈపీడీసీఎల్పై ఆధారపడుతున్న ప్లాంట్ నెలకు రూ.80-90 కోట్లు చెల్లిస్తోంది. దీనిపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


