News May 7, 2025

పద్మనాభం: మద్యానికి బానిసై‌ ఆత్మహత్య

image

పద్మనాభం మండలంలో ఓ యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తగరపువలసకు చెందిన అలుగోలు రవీంద్ర (34) పద్మనాభం మండలం తునివలసలోని జగనన్న కాలనీలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన రవీంద్ర జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినట్లు అతని భార్య పెట్ల వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మనాభం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం తరలించారు.

Similar News

News September 11, 2025

తెలుగు వారికి అండగా ఉంటాం: పల్లా శ్రీనివాస్

image

టీడీపీ ఎల్లప్పుడూ తెలుగు వారి యోగా క్షేమాలు చూస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం నారా లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేశాలని తెలిపారు. వారిని వైజాగ్ తీసుకొచ్చి వారి ప్రాంతాలకు పంపే ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రుషికేశ్‌లో వరదల సమయం, ఉక్రెయిన్ వార్ సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితి‌లో తెలుగు వారికి టీడీపీ అండగా ఉందని గుర్తు చేశారు.

News September 11, 2025

విశాఖ: కాల్పుల కేసులో లొంగిపోయిన నిందితుడు

image

విశాఖలో సంచలనం సృష్టించిన చిలకపేట కాల్పుల కేసులో కానిస్టేబుల్ నాయుడు కోర్టులో లొంగిపొగా14 వరకు రిమాండ్ విధించారు. పలు ఆరోపణలతో ఆయన ఇది వరకే సస్పెండ్ అయ్యాడు. చేపల రాజేశ్‌పై కాల్పులు జరిపిన కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా A-3గా నాయుడు ఉన్నాడు. కోర్టులో లొగిపోవడానికి ముందు విశాఖ సీపీకి ‘తాను ఏ తప్పూ చేయలేదని’ వాట్సప్‌లో మెసేజ్ పెట్టినట్లు సమాచారం. సీఐ జీడీ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News September 11, 2025

బ్లూమ్‌బర్గ్ ఛాలెంజింగ్ పోటీలకు విశాఖ ఎంపిక

image

బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో విశాఖ ఎంపికైందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. 99 దేశాల్లో 600 నగరాలు పోటీ పడగా 50 నగరాలను ఫైనల్‌కు చేశారని, ఇందులో విశాఖ నిలిచిందని చెప్పారు. ప్రతి పౌరుడు జీవీఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో క్యూఆర్ కోడ్‌తో తమ ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలు పంచుకోవాలన్నారు. ఈనెలలో 19వ వార్డులో వర్క్ షాప్ నిర్వహించనున్నామన్నారు.