News February 21, 2025

పద్మనాభం: వేదవ్యాస్‌కు రెండో పతకం

image

చండీగఢ్‌లో నిర్వహిస్తున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన వేదవ్యాస్‌ కాంస్య పతకం సాధించాడు. శుక్రవారం నిర్వహించిన 1000 మీటర్ల పరుగు పోటీలో 34 నిమిషాల 55 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. వేదవ్యాస్ వరుసగా రెండు పతకాలు సాధించడంతో పొట్నూరు ప్రజలు అభినందించారు. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆ గ్రామ ప్రజలు కోరుకున్నారు.

Similar News

News December 26, 2025

విశాఖ: నకిలీ డాక్టర్‌గా చలామణీ అవుతున్న కేటుగాడి అరెస్ట్ (1/2)

image

నకిలీ వైద్యుడి అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్న జ్యోతి శివశ్రీ అలియాస్ నరసింహంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజీహెచ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ చదివి కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు, గతంలో 33 నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇతడి నుంచి రూ. 30 వేల నగదు, స్టెతస్కోప్, వైట్ అప్రాన్ స్వాధీనం చేసుకున్నారు.

News December 25, 2025

విశాఖ: సెప్టిక్ ట్యాంక్‌లో పడి చిన్నారి మృతి

image

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడి మూడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఆనందపురం మండలంలో చోటుచేసుకుంది. ముచ్చర్లలోని YSR కాలనీలో చిన్నారి ఢిల్లీశ్వరి గురువారం ఆడుకుంటుండగా మూత లేని సెప్టిక్ ట్యాంక్‌లో కాలుజారి పడిపోయింది. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతకగా, సెప్టిక్ ట్యాంకులో తేలాడుతూ
చిన్నారి కనిపించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.

News December 25, 2025

విశాఖ వుడా మాజీ అధికారి ఆస్తులు ఈడీ అటాచ్!

image

విశాఖ వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న రూ.1.09 కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. 2002లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పసుపర్తి ప్రదీప్‌కుమార్‌పై దాడులు నిర్వహించి ఈడీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆస్తులు జప్తు చేశారని తెలిపారు. జప్తు చేసిన వాటిలో ప్రదీప్‌కుమార్, ఆయన భార్య పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు ఉన్నాయి.