News February 14, 2026

పనసలో కాయకుళ్లును ఎలా నివారించాలి?

image

పనసలో కాయకుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజం 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున కలిపి పిందె సమయంలో పిచికారీ చేయాలి. మళ్లీ కాయ పెరుగుదల సమయంలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చెట్టు చుట్టూ రాలిన ఆకులు, కుళ్లిన భాగాలను తొలగించి శుభ్రంగా ఉంచాలి. చెట్టుకు సరైన గాలి ప్రసరణ ఉండేలా కొమ్మలను కత్తిరించాలి. సరైన పోషకాలు, నీటి యాజమాన్యం పాటించాలి.

Similar News

News February 19, 2026

తిన్న వెంటనే వాటర్ తాగొచ్చా?

image

భోజనం అయిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలా చేస్తే ఎంజైమ్‌లు, జీర్ణరసాలు పలుచబడి డైజెషన్ మందగిస్తుంది. ఫలితంగా బాడీ పోషకాలను సరిగా గ్రహించుకోలేదు. అలాగే ఇన్సులిన్ లెవెల్స్‌ పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం తినడానికి 10 నిమిషాల ముందు లేదా తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం బెటర్. అవసరమైతే భోజనం మధ్యలో చిన్న సిప్స్ తాగొచ్చు.

News February 19, 2026

పడమర, దక్షిణ దిశల్లో నీటి ప్రవాహాలు ఉంటే?

image

ఇంటికి పడమర, దక్షిణ దిశల్లో నీటి ప్రవాహాలు, లోయలు, గుంతలు, చెరువులు ఉండటం మంచిది కాదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. దీనివల్ల ఇంటికి, ఇంట్లోవారికి భవిష్యత్తులో భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ‘మురికి కాలువలు ఇళ్లకు ఏదిక్కున ఉన్నా ఆరోగ్య సమస్యలుంటాయి. నీటి ప్రవాహాలు ఇళ్లకు తూర్పు, ఉత్తర దిశల్లో ఉండాలి’ అంటున్నారు. అన్ని వాస్తు నియమాలకు శాస్త్రీయ జవాబులుండవని స్పష్టం చేస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 19, 2026

లోకేశ్‌ కౌంటర్‌.. ‘పుష్ప’ స్టైల్లోనే YCP MLA విమర్శలు

image

AP: ‘X’లో TDP-YCP మధ్య ‘పుష్ప’ స్టైల్‌ మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ ఖర్చులతో శ్రీలంకలో <<19173502>>మ్యాచ్<<>> చూశారన్న ఆరోపణలపై మంత్రి లోకేశ్ పుష్ప శైలిలో కౌంటర్ ఇచ్చారు. దీనిపై YCP MLA చంద్రశేఖర్ అదే శైలిలో స్పందిస్తూ.. ‘ఆ దుడ్లు చూసుకునే కదా ఇంతలా పులిపిక్కిపోతాండావు? ఇందాపూర్- హెరిటేజ్‌ల డైరీ మధ్య లింక్ ఏంటి? సిండికేట్ నడిపే వారికి సొంతం అంటూ ఏం ఉండదు.. కమీషన్‌పైనే నడుస్తుంది’ అని విమర్శించారు.