News March 5, 2025
‘పని ప్రదేశంలో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి’

పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. బుధవారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలDలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News September 16, 2025
HYD మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లు

TG: హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లలో ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 20 మంది హిజ్రాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు. గార్డుల నియామకాల కోసం 400 మంది దరఖాస్తు చేసుకోగా నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసినట్లు వివరించారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.
News September 16, 2025
సంగారెడ్డి: రేపు కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమయానికి హాజరుకావాలని సూచించారు.
News September 16, 2025
నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC

AP: రాష్ట్రంలో 21 ఉద్యోగాలకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లైబ్రేరియన్ సైన్స్‌లో జూనియర్ లెక్చరర్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్)- 12+1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)- 3, హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి. రేపటి నుంచి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని APPSC తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <