News January 24, 2025
పనులను నాణ్యతతో చేపట్టాలి: జనగామ అదనపు కలెక్టర్

పాఠశాల మరమ్మతు పనులను నాణ్యతతో చేపట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల, మల్కాపూర్, పల్లగుట్ట, చిల్పూర్ లలో చేపడుతున్న పాఠశాల మరమ్మతు పనులను సందర్శించి పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు.
Similar News
News November 1, 2025
నేడు శ్రీసత్యసాయి జిల్లాలో CM CBN పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లిలో మ.12.45 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించనున్నారు. పెన్షన్ లబ్ధిదారులతో ముచ్చటించిన అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు.
News November 1, 2025
పుష్ప, KGF కూడా అలా రిలీజ్ చేస్తారా?

‘బాహుబలి’ యూనివర్స్‌లో వచ్చిన 2 భాగాలను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా 2 పార్టులుగా వచ్చి హిట్ అయిన సినిమాలపై చర్చ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-2, ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో వచ్చిన KGF, KGF-2ను కూడా ట్రిమ్ చేసి ఇలా ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?
News November 1, 2025
తిరుపతి: ఎకరాకు 3 బస్తాల యూరియా

తిరుపతి జిల్లాలోని రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, అధికారులతో సమీక్షించారు. యూరియా కార్డుల ద్వారా ప్రతి రైతుకు ఎకరాకు 3బస్తాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు.


