News October 30, 2025

పనులను పరిశీలించిన సీఎండీ వరుణ్ రెడ్డి

image

గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఫోర్ట్ రోడ్, నయీంనగర్, నక్కలగుట్ట ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించారు. ఇంజినీర్లు, సిబ్బందితో సీఎండీ మాట్లాడి వారికి పలు సూచనలను చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు త్వరగా చర్యలు తీసుకుని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సీఎండీ సూచించారు.

Similar News

News October 30, 2025

కాగజ్‌నగర్: సైబర్ నేరగాడి అరెస్ట్

image

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆన్ లైన్ ద్వారా రూ.45790 పోగొట్టుకొని ఫిర్యాదు చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు D-4C బృందం ద్వారా సాంకేతిక ఆధారాలను సేకరించి MPకి చెందిన ఆశిష్ కుమార్ దోహార్‌ను పట్టకున్నారు. అతడి ఖాతాలోని రూ.34537.38 ఫ్రీజ్ చేసినట్లు CI వెల్లడించారు.

News October 30, 2025

దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రేయస్ దూరం?

image

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో 2 నెలలపాటు కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబర్, డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌కు ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో న్యూజిలాండ్ జరిగే ODI సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో క్యాచ్ అందుకుంటూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే.

News October 30, 2025

కామారెడ్డి: ఉజ్వల కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాకు కొత్తగా 284 ఉజ్వల కనెక్షన్లు మంజూరైనట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం ఉజ్వల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిపిఎల్ కుటుంబాలు, గ్యాస్ కనెక్షన్ లేనివారు మాత్రమే అర్హులన్నారు. అర్హత గల లబ్ధిదారులు వెంటనే డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించారు.